
న్యూఢిల్లీ:భారత సేవల రంగం వృద్ధి గతనెలలో11నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని మంగళవారం నెలవారీ సర్వే తెలిపింది. కొత్త ఎగుమతుల ఆర్డర్లలో పెరుగుదల, మొత్తం అమ్మకాలలో గణనీయమైన పెరుగుదల ఇందుకు కారణాలు. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్సర్వీస్ ఇండెక్స్ జులైలో 60.5 వద్ద ఉంది. జూన్‌లో 60.4 వద్ద ఉంది.
పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పరిభాషలో 50 కంటే ఎక్కువ ఉండే విస్తరిస్తున్నట్టు అర్థం. ఆసియా, కెనడా, యూరప్, యూఏఈ, యుఎస్ నుంచి కొత్త ఆర్డర్లు భారీగా వచ్చాయని సర్వే తెలిపింది. హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ ఔట్‌పుట్ ఇండెక్స్ జూన్‌లో 61.0 నుంచి జులైలో 61.1కి పాక్షికంగా పెరిగింది. ఇది ఏప్రిల్ 2024 తర్వాత అత్యంత వేగవంతమైన విస్తరణ.