నంబర్​ 1 సూర్య

నంబర్​ 1 సూర్య

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌లో నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో సూర్య 863 రేటింగ్‌‌‌‌ పాయింట్లతో పాక్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ (842)ను వెనక్కి నెట్టాడు. గత వారం నెదర్లాండ్స్‌‌‌‌పై హాఫ్‌‌‌‌ సెంచరీ చేయడంతో సూర్యకు టాప్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ ఖరారైంది. దీంతో విరాట్‌‌‌‌ తర్వాత ఈ ఫీట్‌‌‌‌ సాధించిన రెండో ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. సెప్టెంబర్‌‌‌‌ 2014 నుంచి డిసెంబర్‌‌‌‌ 2017 మధ్య కాలంలో కోహ్లీ 1013 రోజులు నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లో కొనసాగాడు.

రేటింగ్‌‌‌‌ పాయింట్ల పరంగా ఇండియా తరఫున సూర్య సెకండ్‌‌‌‌ బెస్ట్‌‌‌‌గా ఉన్నాడు. 2014లో విరాట్‌‌‌‌ కోహ్లీ 897 పాయింట్లతో టాప్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ను సాధించాడు. మార్చి 14, 2021న ఇంగ్లండ్‌‌‌‌పై టీ20ల్లో డెబ్యూ చేసిన సూర్య.. ఎనిమిది నెలల్లోనే టాప్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌గా ఎదిగాడు. ఇప్పటివరకు ఆడిన 38 మ్యాచ్‌‌‌‌ల్లో 1209 రన్స్‌‌‌‌ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 11 హాఫ్‌‌‌‌ సెంచరీలు ఉన్నాయి. 32 ఏళ్ల సూర్యకుమార్‌‌‌‌ 13 వన్డేలు కూడా ఆడాడు. ప్రస్తుతం కోహ్లీ (638)  పదో ర్యాంక్‌‌‌‌లో, రోహిత్‌‌‌‌ (601).. 15వ ర్యాంక్‌‌‌‌లో ఉన్నారు. బౌలింగ్‌‌‌‌లో భువనేశ్వర్‌‌‌‌ (649)... 11వ, అశ్విన్‌‌‌‌ (627).. 18వ, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ (572).. 27వ ర్యాంక్‌‌‌‌లో నిలిచారు.