మన వ్యాక్సిన్లకు తిరుగులేదు.. 110 శాతం సేఫ్

మన వ్యాక్సిన్లకు తిరుగులేదు.. 110 శాతం సేఫ్
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, భారత్ కు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా తయారు చేసిన కోవిషీల్డ్ తో పాటు హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగం కింద ఉపయోగించుకోవచ్చని డ్రగ్ రెగ్యులేటర్ ప్రకటించింది. భద్రత ప్రమాణాల విషయంలో ఏమాత్రం అనుమానం ఉన్నా కరోనా వ్యాక్సిన్ వినియోగానికి అప్రూల్ ఇవ్వరని, కానీ అప్రూవల్ ఇచ్చిన వ్యాక్సిన్లు 110 శాతం సురక్షితం. సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ 70.42 ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంటే, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచేలా చేస్తుందన్నారు.మరోవైపు వ్యాక్సిన్ అప్రూవల్ పై ప్రధాని మోడీ హర్షం వ్యక్తంచేశారు. ప్రతీ భారతీయుడు గర్వ పడాలి. మనదేశంలో రెండు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయని ట్వీట్ లో పేర్కొన్నారు.