
బటెమి (జార్జియా): ఫిడే విమెన్స్ వరల్డ్ కప్‌లో ఇండియా యంగ్‌స్టర్ దివ్య దేశ్‌ముఖ్ సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన ప్రి-క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో దివ్య వరల్డ్ రెండో ర్యాంక్ ప్లేయర్, చైనా స్టార్ జూ జినెర్‌ను ఓడించి ఔరా అనిపించింది. తెల్లపావులతో ఆడిన దివ్య.. బలమైన ప్రత్యర్థిని అద్భుతంగా నిలువరించింది. ఈ విక్టరీతో తను క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలను పెంచుకుంది.
ఇండియా టాప్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి నల్లపావులతో ఆడి ప్రిక్వార్టర్స్ తొలి గేమ్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన అలెగ్జాండ్రా కోస్టెనియక్ తో డ్రా చేసుకుంది. మరో తెలుగు ప్లేయర్ ద్రోణవల్లి హారిక హారిక కూడా నల్లపావులతో బరిలోకి దిగి రష్యాకు చెందిన కాటెరినా లాగ్నోతో పాయింట్ పంచుకుంది. ఆర్. వైశాలి కజకిస్తాన్ ప్లేయర్ కమలిడెనోవా తో మొదటి గేమ్‌ను డ్రా చేసుకుంది. ఇండియా ప్లేయర్లు గురువారం రెండో గేమ్‌లో పోటీ పడతారు.