IndiGo డొమెస్టిక్ సర్వీసుల రద్దు వెనుక పెద్ద ప్లాన్..! పైలట్ సంచలన ట్వీట్..

IndiGo డొమెస్టిక్ సర్వీసుల రద్దు వెనుక పెద్ద ప్లాన్..! పైలట్ సంచలన ట్వీట్..

వరుసగా మూడోరోజు కూడా విమాన ప్రయాణికులకు ఇండిగో సర్వీసుల ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. కంపెనీ ఏకాగా 550 డొమెస్టిక్, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. ఇక మిగిలిన సర్వీసులు మాత్రం ఆలస్యంతో కొనసాగుతున్నాయి. నిర్వహణలో ఇబ్బందులు తలెత్తటమే దీనికి కారణంగా కంపెనీ చెబుతోంది. అయితే దీనిపై ప్రజల్లోనే కాక పార్లమెంట్ సీతాకాల సమావేశాల్లో కూడా చర్చ కొనసాగుతోంది. 

కేవలం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దాదాపు 92 సర్వీసులు రద్దైనట్లు వెల్లడైంది. దీంతో డొమెస్టిక్ ఫ్లైట్ టిక్కెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇండియాలో ప్రయాణం కంటే విదేశీ ప్రయాణ టిక్కెట్లు తక్కువకు దొరకటం అద్వాన పరిస్థితులకు అద్దం పడుతోంది. కంపెనీ దీనిని సరిచేయటానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ.. దీనివెనుక పెద్ద ప్లాన్ ఉందని పైలట్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. 

ఇండిగో విమానాల రద్దు అనుకోకుండా జరిగినవి కాదని.. ప్లాన్ ప్రకారమే దేశీయ రూట్లలో కంపెనీ విమానాలను రద్దు చేసి విదేశీ రూట్లలో మాత్రం తక్కువ అంతరాయాలతో సేవలను కొనసాగిస్తోందని అన్నారు. అయితే ఆ రూట్లలో ఫ్లైట్స్ నడపటం వల్ల డాలర్లలో రెవెన్యూ వస్తుందని, ఎక్కువ రాబడి, తక్కువ ఇంధన ఖర్చులు ఉండటమే దీనికి కారణంగా అతను పేర్కొన్నారు. అలాగే విదేశీ విమానాల రద్దులకు రూల్స్ కఠినంగా ఉండటంతో కంపెనీ తన రెప్యుటేషన్ కాపాడుకునేందుకు ఇలా చేసినట్లు సదరు పైలట్ పేర్కొంది. 

ప్రయాణికుల బాధను, ఒత్తిడిని సమస్థించుకునే ప్రయత్నంలో భాగంగానే విమాన విధి సమయ పరిమితులు (FDTL) నిబంధనలకు వ్యతిరేకంగా ఇండిగో ఇలా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అధిక లాభాలు వచ్చే ఇంటర్నేషనల్ రూట్స్ కోసం తక్కువ మార్జిన్లు ఉండే డొమెస్టిక్ ప్రయాణికులను బలిచేశారని పైలట్ చెప్పారు. అయితే క్రైసిస్ సమయంలో ఇలా చేయటం ఎంత వరకు సమంజసం అంటూ దేశీయ ప్రయాణికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే డీజీసీఏ కొత్త పైలట్ డ్యూటీ రూల్స్ నవంబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చిన వేళ ఆ ప్రభావం కూడా ఇండిగోపై పడిందని దీంతో 400 విమానాల క్యాన్సిల్, వందల సర్వీసుల ఆలస్యం జరిగిందని తెలుస్తోంది.