గాల్లో ఉండగా బాంబ్ బెదిరింపు.. లక్నోలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

గాల్లో ఉండగా బాంబ్ బెదిరింపు.. లక్నోలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

న్యూఢిల్లీ: ఇండిగో విమానానికి మరోసారి బాంబ్ బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. గాల్లో ఉండగా బాంబ్ థ్రెట్ రావడంతో విమానం అత్యవసరంగా లక్నోలో ల్యాండ్ అయ్యింది. అధికారుల వివరాల ప్రకారం.. ఇండిగో ఎయిర్ లైన్స్‎కు చెందిన విమానం (6E 6650) ఆదివారం (జనవరి 18) ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రాకు బయలుదేరింది. విమానంలో పైలట్లు, సిబ్బందితో పాటు 238 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో విమానంలో బాంబ్ ఉందని రాసిన ఉన్న ఒక టిష్యూ పేపర్ ఫ్లైట్ టాయిలెట్‌లో దొరికింది. 

వెంటనే అప్రమత్తమైన పైలట్లు, సిబ్బంది సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. అనంతరం ఏటీసీ అనుమతితో విమానాన్ని లక్నో ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. భద్రతా సంస్థలు విమానాన్ని ప్రత్యేక బేకు తరలించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విమానం టాయిలెట్ లో టిష్యూ పేపర్ పెట్టిందని ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

►ALSO READ | దేవుడి దయుంటే మేయర్ సీటు మాదే: ఉద్ధవ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు