కడప నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు

కడప నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు

అమరావతి: విజయవాడ నుంచి కడప కు విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇండిగో సంస్థ వారంలో నాలుగు రోజులపాటు విజయవాడ.. కడప మధ్య విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో  విజయవాడ నుంచి ఉదయం 11 గంటలకు కడప నుంచి విజయవాడకు చేరుకోనున్న విమానాలు తిరిగి ఇక్కడ నుంచి 11:45 గంటలకు కడపకు బయలుదేరతాయి.
గతంలో కడప నుంచి విమానాలు నడిపిన ట్రూజెట్ సంస్థ కడప నుంచి విమానాలు నడిపిన ట్రూజెట్ సంస్థ గడువు ముగియడంతో సేవలు నిలిపేసింది. గత ఏడాది నవంబర్ 11న చివరిసారిగా కడప నుంచి బెల్గాం కు విమానాన్ని నడిపింది. అటు తర్వాత సాంకేతిక కారణాలతో విమాన సర్వీసులు నిలిపివేసింది. ప్రభుత్వం మళ్లీ ఇండిగో, ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఇవాళ్టి నుంచి విమాన సర్వీసులు పునః ప్రారంభం అయ్యాయి.  
 అలాగే కడప నుంచి విజయవాడతోపాటు  హైదరాబాద్‌, చెన్నై నగరాలతో పాటు తొలిసారిగా విశాఖపట్నం, బెంగళూరు నగరాలకు కూడా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 

 

ఇవి కూడా చదవండి

సింగరేణిలో మరోసారి మోగనున్న సమ్మె సైరన్ ?

స్విస్ ఓపెన్ టైటిల్ పీవీ సింధు కైవసం

యాదాద్రి జిల్లాలో కోతికి అంత్యక్రియలు