ఏపీకి పెరిగిన ఇండిగో సర్వీసులు

ఏపీకి పెరిగిన ఇండిగో సర్వీసులు

హైదరాబాద్​, వెలుగు: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, కడప, రాజమహేంద్రవరం నుంచి విమాన సర్వీసులను పెంచినట్టు ఇండిగో  ప్రకటించింది. రాజమహేంద్రవరం నుంచి పలు నగరాలకు వారానికి 45 విమానాలను నడుపుతోంది. 

ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు నేరుగా వెళ్లవచ్చు. కడప నుంచి వారానికి 14 విమానాలు నడుస్తున్నాయి. ఇవి హైదరాబాద్, చెన్నై సహా మూడు ప్రాంతాలకు వెళ్తాయి. కర్నూలు నుంచి వారానికి తొమ్మిది విమానాలు బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలకు ప్రయాణిస్తున్నాయి. 2022 మార్చి నుంచి ఈ ప్రాంతాల్లో ఇండిగో సేవలు ప్రారంభించింది.