ఇండిగో లాభం రూ. 1,423 కోట్లు

ఇండిగో లాభం రూ. 1,423 కోట్లు

న్యూఢిల్లీ: డిసెంబర్​ 2022 క్వార్టర్లో ఇండిగో ఎయిర్​లైన్స్​ను నడిపే ఇంటర్​గ్లోబ్​ ఏవియేషన్​ కంపెనీ నికరలాభం 1000 శాతం పెరిగి రూ. 1,422.6 కోట్లకు చేరింది. దేశంలో ఎయిర్​ట్రావెల్​ మళ్లీ జోరందుకోవడంతో కంపెనీ మెరుగైన పనితీరు కనబరిచింది. అంతకు ముందు ఏడాది క్యూ 3 లో ఇండిగో నికరలాభం రూ. 129.8 కోట్లు  మాత్రమే. తాజా క్యూ 3 లో రెవెన్యూ రూ. 15,410 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. డిసెంబర్​ 2021 క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ రూ. 9,480 కోట్లు.

ఆపరేషనల్​గాను, ఫైనాన్షియల్​గానూ మూడో క్వార్టర్​ పర్​ఫార్మెన్స్​ స్ట్రాంగ్​గా ఉందని ఇండిగో సీఈఓ పీటర్​ ఎల్బర్స్​ చెప్పారు. ఆర్గనైజేషన్​లో తీసుకొచ్చిన మార్పులు ఫలితాలు ఇవ్వడం మొదలైందని పేర్కొన్నారు. 300 ఎయిర్​క్రాఫ్ట్​లతో ప్రస్తుతం సేవలు అందిస్తున్నామని, డొమెస్టిక్​, ఇంటర్నేషనల్​ సెక్టార్లలో కెపాసిటీ పెంచే ప్రయత్నాలలో ఉన్నామని వివరించారు. రిజల్ట్స్​ ప్రకటన నేపథ్యంలో శుక్రవారం బీఎస్​ఈ ట్రేడింగ్​లో ఇండిగో షేర్లు 1.2 శాతం తగ్గి రూ. 2,100 వద్ద ముగిశాయి.