రూ.999కే ఫ్లయిట్​ టిక్కెట్

రూ.999కే ఫ్లయిట్​ టిక్కెట్

న్యూఢిల్లీ : ఇండిగో స్పెషల్ సమ్మర్ సేల్‌‌ను తీసుకొచ్చింది. తన నెట్‌‌వర్క్‌‌ ఉన్న ప్రాంతాలన్నింటిలో నాలుగు రోజుల స్పెషల్ సమ్మర్‌‌‌‌ సేల్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఈ సేల్ జూన్ 16 నుంచి సెప్టెంబర్ 28 మధ్యలో ప్రయాణాలకు వర్తించనుందని ఇండిగో తెలిపింది. ‘మంగళవారం నుంచి శుక్రవారం వరకు, దేశీయ రూట్లలో విమాన టిక్కెట్‌‌ను ప్రారంభ ధర రూ.999కే కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నాం. విదేశీ రూట్లకు రూ.3,499 నుంచి టిక్కెట్‌‌ను అందిస్తున్నాం. ఈ సేల్‌‌లో బుక్ చేసుకున్న టిక్కెట్లు 2019 జూన్ 16 నుంచి 2019 సెప్టెంబర్ 28 మధ్య ఉపయోగించుకోవచ్చని  ఈ లో–కాస్ట్ క్యారియర్  ప్రకటించింది. దేశీయ ప్యాసెంజర్ మార్కెట్‌‌లో ఇండిగోకు సుమారు 50 శాతం మార్కెట్‌‌ షేరు ఉందని ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ డేటాలో వెల్లడైంది. గత నెలలో నిర్వహించిన సేల్‌‌కు అనూహ్యమైన స్పందన వచ్చిందని, సమ్మర్ వెకేషన్లకు అంతకు మించి  డిమాండ్ వస్తుందని తాము భావిస్తున్నామని ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియమ్ బౌల్టర్ చెప్పారు. అఫర్డబుల్ రేట్లకు వెకేషన్‌‌ను ప్లాన్ చేసుకోవాలనుకునే కస్టమర్ల కోసం స్పెషల్ ధరలను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు.