ఇగ్నోలో ఆన్‌లైన్ అగ్రికల్చర్ కోర్సులు.. ఇలా అప్లై చేసుకోండి

ఇగ్నోలో ఆన్‌లైన్ అగ్రికల్చర్ కోర్సులు.. ఇలా అప్లై చేసుకోండి

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) ఆన్‌లైన్ అగ్రికల్చర్ కోర్సులను ప్రారంభించింది, అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సులను అందిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ http://ignou.ac.in/ ద్వారా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సు, ఒక సంవత్సరం డిప్లొమా కోర్సు, అలాగే UG, PGలు ఉన్నాయి. 

డైరీ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ ఉత్పత్తి, సెరికల్చర్, వ్యవసాయ విధానంతో సహా వివిధ కోర్సుల కోసం దరఖాస్తులు చేసుకోవచచ్చు.  అదనంగా, ఇగ్నో అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్, వాటర్ అండ్ వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్, డైరీ టెక్నాలజీ వంటి ప్రత్యేక రంగాలలో డిగ్రీలను అందిస్తుంది.  ఈ కోర్సులు ఇంటి నుండి నేర్చుకునే సౌలభ్యాన్ని కూడా అందిస్తున్నారు.