కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్.. రద్దు చేసిన ప్రభుత్వం

కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్.. రద్దు చేసిన ప్రభుత్వం

సీఎం  యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు.  పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2023ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  ఆరు నెలల్లోగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.  పేపర్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో ప్రశ్నపత్రం వైరల్ కావడంతో ..  పరీక్షకు హాజరైన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

యూపీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 17 మరియు 18 తేదీల్లో  పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ నిర్వహించారు. యువత జీవితాలతో  ఆటలాడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా  సీఎం యోగి హెచ్చరించారు. దీనికి తోడు, రివ్యూ ఆఫీసర్/అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ (RO/ARO) పరీక్షలో జరిగిన అవకతవకలు,  రిగ్గింగ్‌లను ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు చేయాలని యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.