ఇందిరా గాంధీ ఉండుంటే బీజేపీని నిషేధించేవారు: రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్

ఇందిరా గాంధీ ఉండుంటే బీజేపీని నిషేధించేవారు: రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్

జైపూర్: మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఇందిరా గాంధీ నేడు అధికారంలో ఉండి ఉంటే ఆ పార్టీని నిషేధించేవారన్నారు. ఆదివారం జైపూర్‌‌‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గెహ్లాట్ మాట్లాడారు. మతాన్ని రాజకీయ సాధనంగా వాడకూడదని, కానీ బీజేపీ హిందుత్వ పేరుతో ఓటర్లను సమీకరిస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం బీజేపీ ఏజెంట్‌‌‌‌లా పనిచేస్తోందని, న్యాయవ్యవస్థతో పాటు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ధ్వజమెత్తారు.