వరంగల్ జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ

వరంగల్ జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ

జనగామ అర్బన్, వెలుగు: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జనగామ వ్యవసాయ మార్కెట్​ చైర్మన్​ బనుక శివరాజ్​యాదవ్​ అన్నారు. మంగళవారం జనగామ మండలంలోని వెంకీర్యాల గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. నాయకులు లింగాల నర్సిరెడ్డి, మద్దెల ప్రసాద్, కాలే ఉప్పలయ్య, ఈర్ల లక్ష్మణ్, ఏదునూరి రవీందర్, కర్రె రాజు, నర్సింహులు పాల్గొన్నారు. 

ఎల్కతుర్తి, వెలుగు: ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చీరలు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ గొడిశాల యాదగిరి గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ గొడిశాల రాజయ్య గౌడ్, నాయకులు పాక రమేశ్, రమేశ్ బాబు, కడారి సురేందర్ తదితరులున్నారు.

తాడ్వాయి, వెలుగు: ఊరటం, కొత్తూరు, తాడ్వాయి, ఏలుబాక, కొండపర్తి తదితర గ్రామాల్లో మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. తాడ్వాయి మాజీ సర్పంచ్ ఈర్ప సునీల్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆరెం లచ్చు పటేల్ మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ధనసరి అనసూయ కృషి చేస్తున్నారని తెలిపారు. మాజీ సర్పంచ్ మంకిడి నరసింహస్వామి, సీనియర్ నాయకులు కడారి లక్ష్మయ్య,  రేపాక సంతోష్ రెడ్డి, ములుగు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జాలిగాపు జంపన్న,  మండల కోఆర్డినేటర్ గజ్జెల రాజశేఖర్​పాల్గొన్నారు.