టీఎంసీ అంటే తెలియని మంత్రులు YSRపై విమర్శలా?

టీఎంసీ అంటే తెలియని మంత్రులు YSRపై విమర్శలా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రాష్ట్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు వైఎస్ షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్. రాష్ట్రానికి వైఎస్ ఏం చేశారో తెలంగాణ ప్రజలందరికి తెలుసునన్నారు ఇందిరా శోభన్. రాజశేఖర్ రెడ్డి విజన్ తోనే దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా కోనసీమ కావాలని వైఎస్ ఆకాంక్షించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. ప్రస్తుత పాలకులు పాలమూరు రైతుల నోట్లో మట్టికొట్టారన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏసీబీ కేసులో ఇరుక్కుంటే మళ్లీ వైఎస్సారే ఉద్యోగంలోకి తీసుకున్నారని గుర్తుచేశారు. టీఎంసీ అంటే ఏంటో తెలియని మంత్రులు కూడా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.