నిరుద్యోగుల ఆకలి తీర్చేలా ‘ఇందిరమ్మ క్యాంటీన్’.. సిటీ సెంటర్ లైబ్రరీ లో ప్రారంభం

 నిరుద్యోగుల ఆకలి తీర్చేలా ‘ఇందిరమ్మ క్యాంటీన్’.. సిటీ సెంటర్ లైబ్రరీ లో ప్రారంభం

ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీలో చదువుకునే విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఇందిరమ్మ అల్పాహార క్యాంటీన్​అందుబాటులోకి వచ్చింది. లైబ్రరీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్​ను సోమవారం జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ జోనల్ కమిషనర్ మంగతాయారు, డిప్యూటీ కమిషనర్లు ప్రవీణ్ కుమార్ రెడ్డి, పుష్పలత కలిసి ప్రారంభించారు. 

హాస్టళ్లు, బ్యాచిలర్ రూమ్​లలో ఉండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగులకు ఈ అల్పాహార కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని జోనల్ కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో లైబ్రరీ అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.