అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు : గుమ్ముల మోహన్ రెడ్డి

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు :   గుమ్ముల మోహన్ రెడ్డి

నల్గొండ, వెలుగు: నల్గొండ పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ స్థానిక వార్డు ఇన్చార్జి గుండగోని సాయితో కలిసి ఓర్సు శ్రీను - నర్సమ్మ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం లో  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ నియోజకవర్గంలో 3,500 ఇండ్లతో పాటు నల్గొండ పట్టణంలోనే 550 ఇందిరమ్మ ఇండ్లు  మంజూరయ్యాయని అన్నారు. 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వజ్జ రమేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబా, కత్తుల కోటి, ఖలీల్, ఎండి జావిద్, యాదయ్య, పిల్లి రమేశ్ యాదవ్, అశోక్, పాదం అనిల్ , యువజన కాంగ్రెస్ నాయకులు గాలి నాగరాజు, మామిడి కార్తీక్, కంచర్ల ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.