రాజకీయాలకు అతీతంగా రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రాజకీయాలకు అతీతంగా  రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ధర్మసాగర్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం ముప్పారంలో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు, నారాయణగిరిలో ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ముప్పారంలో 64, నారాయణగిరి 40, సోమదేవరపల్లి 4 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి అందజేశారు. 

ఇవేకాక ముప్పారంలో గౌడ, కురుమ కమ్యూనిటీ హాల్స్, నారాయణగిరిలో ముదిరాజ్, మహిళా కమ్యూనిటీ హాల్స్​మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 ఏండ్లుగా తనకు అండగా నిలుస్తున్న ముప్పారం, నారాయణగిరి గ్రామాల ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. కార్యక్రమంలో నారాయణగిరి సర్పంచ్ పుట్ట రేణుక, ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక, హౌసింగ్ పీడీ సిధార్థ్ నాయక్, పీఆర్ ఈఈ సైదులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.