ఇందిరమ్మ స్కీమ్ కు కాల్ సెంటర్..నేడు (సెప్టెంబర్ 10న) ప్రారంభించనున్న మంత్రి

ఇందిరమ్మ స్కీమ్ కు కాల్ సెంటర్..నేడు (సెప్టెంబర్ 10న) ప్రారంభించనున్న మంత్రి
  • 1800 599 5991 టోల్ ఫ్రీ నంబర్ 
  • నేడు ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు ప్రభుత్వం కాల్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ కాల్ సెంటర్ ను బుధవారం హిమాయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ లో ఏర్పాటు చేయగా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కాల్ సెంటర్ కు1800 599 5991 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు.

 10 మంది సిబ్బందితో ఈ కాల్ సెంటర్ పనిచేయనుండగా స్కీమ్ పై లబ్ధిదారులు, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారం చేసేలా ఈ కాల్ సెంటర్ పనిచేయనుంది. హౌసింగ్ తో పాటు పంచాయతీ కార్యదర్శులు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు.