- లబ్ధిదారులకు 5,376 కోట్లు రిలీజ్: ఎండీ వీపీ గౌతమ్
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో ఒక లక్షా 13 వేల 365 ఇందిరమ్మ ఇండ్ల శ్లాబులు పూర్తయ్యాయని హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ వీపీగౌతం వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 34,552 ఇండ్లు గోడలు పూర్తయిన దశలో, మరో 61 వేల ఇండ్లు బేస్ మెంట్ పూర్తయ్యాయని వివరించారు.
ఇప్పటిదాకా లబ్ధిదారులకు రూ.5376.22 కోట్లను విడుదల చేశామని వివరించారు. మంగళవారమే 4, 473 మందికి రూ.48.79 కోట్లను విడుదల చేశామని చెప్పారు. ప్రతీ వారం ఇండ్ల నిర్మాణ దశల ఆధారంగా లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేస్తున్నామన్నారు.
