ఇండోనేసియాలో పేలుడు.. 13 మంది మృతి

ఇండోనేసియాలో పేలుడు.. 13 మంది మృతి

జకార్తా: ఇండోనేసియాలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. సైన్యానికి సంబంధించిన కాలం చెల్లిన పేలుడు పదార్థాలను నాశనం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇండోనేసియా పశ్చిమ జావా ఫ్రావిన్స్ గరుట్ జిల్లాలో మందుగుండు సామగ్రిని నాశనం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పేలుడులో 13 మంది చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. బాధితుల్లో నలుగురు సైనికులు, తొమ్మిది మంది నివాసితులు ఉన్నారని ఇండోనేసియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. పేలుడుకు కారణాలు స్పష్టంగా తెలియవని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.