ఇండోనేసియాలో కూలిన స్కూల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌.. 37కి పెరిగిన మరణాల సంఖ్య

ఇండోనేసియాలో  కూలిన స్కూల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌..  37కి పెరిగిన మరణాల సంఖ్య

సిడోయార్జో: ఇండోనేసియా సిడోయార్జోలోని ఓ స్కూల్ కూలిపోయిన ఘటనలో మరణాల సంఖ్య 37కి పెరిగింది. జూవా ఐల్యాండ్‌‌‌‌ తూర్పున ఉన్న సిడోయార్జోలోని పాత కాలం నాటి అల్‌‌‌‌ ఖోజిని స్కూల్‌‌‌‌ సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 30న కూలిపోయింది.

 ఈ స్కూల్‌‌‌‌లో వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌‌‌‌లో 12 నుంచి 19 ఏండ్ల వయసు గల బాలురే ఎక్కువ మంది ఉన్నారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 30న క్లాసులు జరుగుతుండగా, ఒక్కసారిగా బిల్డింగ్‌‌‌‌ కూలిపోయింది. దీంతో స్టూడెంట్లు అందరూ శిథిలాల కింద చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది మొత్తం 95 మంది కాపాడారు.