జాతీయ స్ఫూర్తి నింపేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

జాతీయ స్ఫూర్తి నింపేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ అధికారులు, అధికారులు  ఫ్రీడమ్ రన్ నిర్వహించారు.  మహబూబాబాద్ లో నిర్వహించిన 2కే రన్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ప్రారంభించారు. మరిపెడలో నిర్వహించిన 2కే రన్ కు ఎమ్మెల్యే రెడ్యా నాయక్, స్కూల్ స్టూడెంట్స్, యువత హాజరయ్యారు.

హన్మకొండ కలెక్టరేట్ దగ్గర చీఫ్ విఫ్ దాస్యం వినయ్ భాస్కర్  జెండా ఊపి 2కే రన్ ప్రారంభించారు. వర్ధన్న పేటలో కూడా 2కే రన్ నిర్వహించారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి  అంబేద్కర్ స్టేడియంలో ఫ్రీడమ్ రన్ ప్రారంభించారు. జనగామ జిల్లాలో రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు సాగిన ఫ్రీడం రన్ ను కలెక్టర్ ప్రారంభించారు.

కోదాడ టౌన్ లో  మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లంమల్లయ్య యాదవ్ , పశువైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్ చౌరస్తా నుంచి 2K రన్ నిర్వహించారు. ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర్ రెడ్డి ,కలెక్టర్ జెండా ఊపి ఫ్రీడమ్  రన్ ను ప్రారంభించారు.

పెద్దపల్లి జిల్లాలో ఐటీఐ గ్రౌండ్ నుంచి జూనియర్ కాలేజ్ వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు.  జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఛైర్మన్ మమతారెడ్డి, డీసీపీ రన్ ను ప్రారంభించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గాంధీ చౌరస్తా వరకు నిర్వహించిన ఫ్రీడమ్ రన్ ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. జగిత్యాల పట్టణంలో ఫ్రడమ్ రన్ ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్,  జడ్పీ ఛైర్ పర్సన్ దావా వసంత ప్రారంభించారు. ఫ్రీడమ్ రన్ లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.

కామారెడ్డి మున్సిపల్  కేంద్రంలోని అంబెడ్కర్ చౌక్ నుండి గాంధీ చౌక్  వరకు సాగిన 1 కే ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే సురేందర్, పోలీసులు, అధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బాన్సువాడలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ లో   స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లిలో జిల్లా కలెక్టర్ జెండా ఊపీ ఫ్రీడం రన్ ప్రారంభించారు. నిజామాబాద్  జిల్లా బోధన్ పట్టణంలో  నిర్వహించిన 2K  రన్ ను  ఎమ్మెల్యే షకీల్ , మున్సిపల్ చైర్మన్ తుమూ పద్మ శరత్ రెడ్డి పాల్గొన్నారు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా  పటాన్ చేరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, రామచంద్రపురం సంగీత థియేటర్ నుండి, పటాన్ చెరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని నింపారు. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, జయశంకర్  సూర్యాపేట, కరీంనగర్, సరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో 2కే రన్ నిర్వహించారు.