
నిర్మల్, వెలుగు: బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, ప్రణాళిక మండలి వైస్‌చైర్మన్ జి.చిన్నారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులతో కలిసి హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. తనను కాంగ్రెస్‌లో చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపి, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పారు. అనంతరం సీఎంను సన్మానించారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులు, పలువురు ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు.