ములుగు, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: జూలై 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంగళవారం ములుగు కలెక్టర్ దివాకర మంగళవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కర ఘాట్లను ఫీల్డ్ విజిట్ చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు ములుగు జిల్లాలోని గోదావరి నది పుష్కర ఘాట్లయిన ముళ్లకట్ట, రామన్నగూడెం, మంగపేట, వెంకటాపురం ప్రాంతాల్లోని ఘాట్ల వివరాలు, చేపట్టవలసిన పనులపై సమగ్ర సమాచారం అందించాలన్నారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
