
కామారెడ్డి జిల్లా : ఈ సారి హరితహరంలో 100 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం అన్నారు రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి .35 శాతం ఉన్న అడవులు ప్రస్తుతం 24 శాతంకు తగ్గాయన్నారు.వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. 2015 లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన మొక్కను సందర్శించడం జరిగిందన్నారు.అడవుల పెంపకానికి రాష్ట్ర ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ హరితహరాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి విరివిగా మొక్కలు నాటాలన్నారు ఇంద్రకరణ్ రెడ్డి.