
హైదరాబాద్, వెలుగు: రిటైల్ వెల్త్ మేనేజ్‌మెంట్ సేవల సంస్థ అయిన ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్, పుణెకు చెందిన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇండస్ క్యాపిటల్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. 2025 ఆగస్టు నాటికి, ఇండస్ క్యాపిటల్ నిర్వహించే ఏయూఎం రూ.2,030 కోట్లుగా ఉంది. ఇందులో ఈక్విటీవాటా 95.3 శాతం ఉంది.
సిప్ బుక్ విలువ రూ.10.83 కోట్లుఉంది. ప్రస్తుతం ఈ సంస్థ 3,571 కుటుంబాలకు సేవలు అందిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఇండస్ క్యాపిటల్ కస్టమర్లు ఫండ్స్ బజార్‌లోకి మారతారు. దీనివల్ల వారికి ఎక్కువ ప్రొడక్ట్స్ అందుబాటులోకి వస్తాయి. దాంతోపాటు మరింత మెరుగైన టెక్ ప్లాట్‌ఫారమ్ లభిస్తుంది. ఈ డీల్ విలువ రూ.113.75 కోట్లని ప్రుడెంట్ తెలిపింది.