ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండ పట్టణంలోని కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో జ్వరం, ఫిట్స్‌‌‌‌‌‌‌‌తో ఓ శిశువు చనిపోయాడు. ఇందుకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా అనుముల మండలం శ్రీనాథపురానికి చెందిన చింతకాయల సరిత డెలివరీ కోసం ఈ నెల 22న నల్గొండ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చేరింది. 23న పెయిన్స్‌ రావడంతో 24న ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేయగా బాబు పుట్టాడు. అయితే శిశువు ఉమ్మనీరు తాగడంతో ఐసీయూలో ఉంచి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

25న బాబుకు జ్వరం రావడంతో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేశారు. తర్వాత మరోసారి జ్వరంతో పాటు ఫిట్స్‌‌‌‌‌‌‌‌ రావడంతో మంగళవారం బాబు చనిపోయాడు. అయితే డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే బాబు చనిపోయాడని బంధువులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న టూటౌన్‌‌‌‌‌‌‌‌ పోలీసులు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ లచ్చునాయక్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ బాలుడి మృతిపై ఎంక్వైరీ చేస్తామని, డాక్ర్ల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మనీరు ఊపిరితిత్తులలోకి చేరి జ్వరం, ఫిట్స్​ రావడం వల్లే బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారన్నారు. 

ప్రజల హక్కులను కాపాడడమే లక్ష్యం

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకొని, ప్రజల హక్కులను కాపాడడమే లక్ష్యంగా సీపీఐ పనిచేస్తోందని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు చెప్పారు. హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ సీపీఐ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మంగళవరం జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. అక్టోబర్14 నుంచి 
విజయవాడలో జరిగే మహాసభలను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ సభ్యులు యల్లావుల రాములు, కంబాల శ్రీనివాస్, దేవరం మల్లీశ్వరి, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రమేశ్‌‌‌‌‌‌‌‌, జక్కుల రమేశ్‌‌‌‌‌‌‌‌, ఇందిరాల వెంకటేశ్వర్లు, మామిడి వెంకయ్య, సోమగాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కరెంట్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌తో రైతు మృతి

కోదాడ, వెలుగు : కరెంట్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌తో ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిలసింగారంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లమాళ్ల శేషగిరి, మరో రైతు బుర్ర పుల్లయ్య (65)తో కలిసి తన పొలానికి మంగళవారం మందు కొడుతున్నాడు. రాత్రి పడిన వర్షానికి కరెంట్‌‌‌‌‌‌‌‌ వైర్‌‌‌‌‌‌‌‌ తెగి పడింది. గమనించని శేషగిరి పొలంలోకి దిగగానే షాక్‌‌‌‌‌‌‌‌ కొట్టింది. అతడి కేకలు విన్న పుల్లయ్య రక్షించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి కూడా షాక్‌‌‌‌‌‌‌‌ కొట్టడంతో స్పాట్‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయాడు. శేషగిరి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

కొనసాగుతున్న యోగా పోటీలు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండ పట్టణంలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. చిన్న వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫంక్షన్‌‌‌‌‌‌‌‌హాల్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న పోటీలను రెండో రోజైన మంగళవారం ఎంజీయూ వీసీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ చొల్లేటి గోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంతో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు. యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోట సింహాద్రి మాట్లాడుతూ బుధవారం ఫైనల్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించిన అనంతరం విజేతలకు ప్రైజ్‌‌‌‌‌‌‌‌లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి, లెక్చరర్లు అంజిరెడ్డి, ఆకుల రవి, అల్వాల రవి తదితరులు పాల్గొన్నారు.

ముక్త్యాల మేజర్‌‌‌‌‌‌‌‌ కాల్వలో యువకుడు గల్లంతు

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఈత కొట్టేందుకు  సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ముక్త్యాల మేజర్‌‌‌‌‌‌‌‌ కాల్వలోకి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళ్తే... చింతలపాలెం మండలం తమ్మారం గ్రామానికి చెందిన తిమ్మిరెడ్డి ప్రతాప్‌‌‌‌‌‌‌‌రెడ్డి తన ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ రామకృష్ణారెడ్డితో కలిసి హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ వస్తున్నాడు. ఈ క్రమంలో వేపల సింగారం బైపాస్‌‌‌‌‌‌‌‌ రోడ్డులోని కాల్వ వద్దకు రాగానే రామకృష్ణారెడ్డి ఫోన్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతుండగా, ప్రతాప్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఈత కొట్టేందుకు కాల్వలోకి దిగాడు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు చెప్పడంతో నీటి ప్రవాహం తగ్గించి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. రాత్రి వరకు వెతికినా యువకుడి ఆచూకీ దొరకలేదు.

మునుగోడు కోసమే రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజీనామా

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజీనామా చేశారని చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి రేవూరి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లోని బీజేపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మంగళవారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. మునుగోడులో రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి గెలిచినందునే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నిధులు విడుదల చేయలేదన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ రెండోసారి సీఎం అయ్యాక అవినీతి పెరిగిందని, ప్రజలంటే చులకనభావం ఏర్పడిందన్నారు. రూ. 58 వేల కోట్ల మిగులు బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ఉన్న రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లాలని ఆరోపించారు. మునుగోడు ఎన్నిక ఇక్కడి ప్రజలే కాదు.. రాష్ట్ర భవిష్యత్‌‌‌‌‌‌‌‌నే మారుస్తుందన్నారు. రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కోఇన్‌‌‌‌‌‌‌‌చార్జులు సుభాశ్‌‌‌‌‌‌‌‌ చందర్‌‌‌‌‌‌‌‌, కర్నాటి ధనుంజయ, జడ్పీటీసీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

మహిళా చట్టాలపై అవగాహన పెంచాలి

సూర్యాపేట, వెలుగు : మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూర్యాపేట అడిషినల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌రావు సూచించారు. సభి సెంటర్‌‌‌‌‌‌‌‌, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన జిల్లా మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. గృహహింస, నిర్భయ చట్టాలపై స్టూడెంట్లకు అవగాహన కల్పించాలన్నారు. లీగర్‌‌‌‌‌‌‌‌ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌ నియామకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ జ్యోతి పద్మ, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో కోట చలం, గ్రామ్య రిసోర్స్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ వుమెన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రుక్మిణీరావు, బాలల పరిరక్షణ అధికారి రవికుమార్ పాల్గొన్నారు.

పోడు భూములను పరిశీలించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌

మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పోడు భూములను మంగళవారం సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పరిధిలో ఉన్న పోడు భూములు, సాగు, హద్దుల వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005కు ముందు నుంచి భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో గుర్తించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని చెప్పారు. ఆయన వెంట డీఆర్డీఏ కిరణ్, డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో సతీశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, ఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌వో లక్ష్మీపతిరావు, ఆర్డీవో వెంకారెడ్డి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ లక్యా పాల్గొన్నారు.

స్వర్ణ తాపడానికి రూ. లక్ష విరాళం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణతాపడం కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వీరభద్రయ్య, రాధాదేవి దంపతులు రూ. లక్ష విరాళం ఇచ్చారు. ఈ చెక్కును మంగళవారం ఏఈవో గజవెల్లి రఘుకు అందజేశారు. అనంతరం ప్రధానాలయంలో నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిత్య పూజలు వైభవంగా జరిగాయి. పుష్కరిణి పక్కన గల హనుమాన్‌‌‌‌‌‌‌‌ టెంపుల్‌‌‌‌‌‌‌‌లో ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించారు. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.22,32,121 ఇన్‌‌‌‌‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. 

అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు

మునగాల, వెలుగు : అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్‌‌‌‌‌‌‌‌గూడెం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పెన్షన్‌‌‌‌‌‌‌‌ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్‌‌‌‌‌‌‌‌ రాని వారి అప్లికేషన్లను మరో సారి పరిశీలించి పెన్షన్‌‌‌‌‌‌‌‌ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బుర్ర సుధారాణి, జడ్పీటీసీ నలపాటి ప్రమీల, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సుంకర అజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, మండల అధ్యక్షుడు రమేశ్‌‌‌‌‌‌‌‌, సెక్రటరీ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం

మునుగోడు, వెలుగు : పేదల మేలు కోసమే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడులో మంగళవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూ. 340 కోట్ల ఖర్చుతో మహిళలకు చీరలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఆసరా పెన్షన్‌‌‌‌‌‌‌‌ ద్వారా వృద్ధులకు గౌరవం పెరిగిందన్నారు. మునుగోడులో ఫ్లోరోసిస్‌‌‌‌‌‌‌‌ను తరిమికొట్టేందుకు మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తిని గెలిపించుకోవాలని సూచించారు. మునుగోడులో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. మునుగోడు ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్‌‌‌‌‌‌‌‌, ఎంపీటీసీలు శ్రావణి నాగరాజుగౌడ్, నిర్మల శరత్ పాల్గొన్నారు. 

అమ్మవారికి ప్రత్యేక పూజలు

యాదగిరిగుట్ట/కోదాడ, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుబంధమైన శివాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజైన మంగళవారం ఉదయం అమ్మవారికి శ్రీలలితా అష్టోత్తర శతనామార్చన, సప్తశతీ పారాయణాలు, జపాలు, త్రిశతీదేవీ ఖడ్గమాల నామావళి నిర్వహించారు. సాయంత్రం నవావరణ పూజ, నీరాజన మంత్రపుష్పాలు జరిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం అర్చనలు, పారాయణాలు, శ్రీదేవి మూలమంత్ర జపాలు, సహస్రనామార్చన, నవావరణ పూజ, సహస్రనామార్చన, మంత్ర పుష్పం జరపనున్నారు. అలాగే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

సాగర్‌‌‌‌‌‌‌‌ బుద్ధవనానికి అవార్డు

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌లోని బుద్ధవనానికి ఉత్తమ పౌర సదుపాయాలున్న ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా అవార్డు దక్కింది. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హైటెక్స్‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఉప్పల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గుప్తా చేతుల మీదుగా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఉన్న బుద్ధవనానికి ఉత్తమ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. పర్యాటక రంగంలో నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్‌‌‌‌‌‌‌‌ సుల్తానియా, సీఎండీ మనోహర్, అధికారులు సుధన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, క్రాంతి బాబు, శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు.

పత్తి కొనుగోళ్లకు రెడీగా ఉండాలి

యాదాద్రి, వెలుగు : పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని యాదాద్రి అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ డి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారని, 5.53 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు తెలిపారు. అనంతరం అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ నవంబర్ నుంచి జనవరి వరకు ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూర్, వలిగొండ మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీల ద్వారా జిల్లాలోని 15 కాటన్‌‌‌‌‌‌‌‌ మిల్లులకు పత్తి వస్తుందన్నారు. సంబంధిత శాఖల ఆఫీసర్లు కోఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌తో పనిచేసి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలన్నారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌లో మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ సబిత, ఏడీఏ నీలిమ, ఫైర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ అశోక్, లీగల్‌‌‌‌‌‌‌‌ మెట్రాలజీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ సంజయ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ పాల్గొన్నారు.

మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి కృషి

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ పట్టణంలో అవసరమైన సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు చెప్పారు. పట్టణంలో చేపట్టిన సీసీ రోడ్లు, బ్రిడ్జి కింద సుందరీకరణ పనులకు మంగళవారం మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ తిరునగరు భార్గవ్‌‌‌‌‌‌‌‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. పనులను ఇన్‌‌‌‌‌‌‌‌టైంలో క్వాలిటీతో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ రవీంద్రసాగర్, డీఈ విజయలక్ష్మి, కౌన్సిలర్లు రమాదేవి, బాసాని అలివేలుగిరి, రమేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ముడొత్తుల పృధ్వీరాజ్‌‌‌‌‌‌‌‌ (28) స్థానిక ఓ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో రికవరీ ఏజెంట్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. గతేడాది తల్లి చనిపోగా, తండ్రి పట్టించుకోవడం మానేశాడు. ఆరు నెలల కింద చెల్లి భార్గవికి పెండ్లి చేసి పంపించాడు. దీంతో అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తన చెల్లెలికి ‘జాగ్రత్తగా ఉండు, సారీ’ అని మెసేజ్‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. కొద్ది సేపటి తర్వాత మెసేజ్‌‌‌‌‌‌‌‌ చూసిన భార్గవి హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని తెలిసిన వారికి విషయం చెప్పి ఇంటికి వెళ్లి చూడమని కోరింది. వారు వచ్చే సరికి పృధ్వీరాజ్‌‌‌‌‌‌‌‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి చెల్లెలు భార్గవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

దేవరకొండ (పీఏపల్లి), వెలుగు : కుటుంబ కలహాలతో దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పడమటితండాలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన రమావత్‌ లక్ష్మణ్‌ (24)కు నేరేడుగొమ్ము మండలం కొత్తపల్లి పరిధిలోని మేగావత్‌ తండాకు చెందిన నిఖిత(20)తో ఆరు నెలల క్రితం పెండ్లి జరిగింది. వీరు పడమటి తండాలోనే కిరాణ షాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయారు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి వివరాలు సేకరించారు.

కొండా లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ బాపూజీకి ఘన నివాళి

కొండా లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ బాపూజీ జయంతిని మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటో, విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో పాటు వివిధ సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు.

- వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌