పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని బొల్లోరుగూడెంలో నాలుగు రోజుల వయసున్న మృత శిశువు పుర్రె కలకలం రేపింది. బుధవారం స్థానికుడు గోవర్ధన్ ఇంటి వద్ద కుక్కలు శిశువు పుర్రె భాగాన్ని పీక్కుతింటూ కనిపించాయి. వెంటనే ఆయన స్థానిక పోలీసులతో పాటు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
టౌన్ ఎస్సై నాగరాజు సంఘటన స్థలానికి చేరుకొని శిశువు పుర్రెను స్వాధీనం చేసుకున్నారు. మిగతా అవశేషాల కోసం పరిసరాల్లో గాలించినా దొరకలేదు. పుర్రెను ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు. ఘటనపై విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
