యాక్సిస్​ బ్యాంక్​ నుంచి ఇన్ఫినిటీ సేవింగ్స్​ అకౌంట్

యాక్సిస్​ బ్యాంక్​ నుంచి ఇన్ఫినిటీ సేవింగ్స్​ అకౌంట్

హైదరాబాద్​, వెలుగు : చాలా సర్వీసులకు ఛార్జీలు లేని, మినిమం బాలెన్స్​ అవసరం లేని ఒక సబ్​స్క్రిప్షన్​ బేస్డ్​ సేవింగ్స్​ అకౌంట్ ​ఇన్ఫినిటీ పేరుతో యాక్సిస్​ బ్యాంక్​ తన కస్టమర్ల కోసం లాంఛ్​ చేసింది. కస్టమర్లకు ఈ ఇన్ఫినిటీ సేవింగ్స్​ అకౌంట్​ కోసం నెలకు రూ. 150 లేదా ఏడాదికి రూ. 1,650 చెల్లిస్తే సరిపోతుందని యాక్సిస్​ బ్యాంకు ప్రకటించింది. అకౌంట్​లో మినిమం బాలెన్స్​ లేకపోతే చాలా బ్యాంకులు పెనాల్టీలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్​ శావీ కస్టమర్ల కోసం ఈ కొత్త ఇన్ఫినిటీ సేవింగ్స్​ అకౌంట్​ను తీసుకొచ్చినట్లు యాక్సిస్​ బ్యాంక్​ వివరించింది.

ఎస్​ఎంఎస్​ అలర్టులు, చెక్​బుక్కులు వంటి సదుపాయాల కోసం కస్టమర్లు వేరుగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కస్టమర్ల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకునే ఈ కొత్త తరహా సబ్​స్క్రిప్షన్​ బేస్డ్​ సేవింగ్స్​ అకౌంట్స్​ను తెస్తున్నట్లు యాక్సిస్​ బ్యాంక్​ రిటెయిల్​ లయబిలిటీస్​ హెడ్​ రవి నారాయణన్​  చెప్పారు. మినిమం బాలెన్స్​ అవసరమే ఉండదని, డొమెస్టిక్​  ట్రాన్సాక్షనల్​ ఫీజులుండవని, ఎన్నిసార్లైనా డెబిట్​కార్డుతో ఏటీఏం లావాదేవీలు జరపొచ్చని పేర్కొన్నారు. చెక్​బుక్​ వాడకంపై ఛార్జీలుండవని, లిమిట్స్​కు మించిన విత్​డ్రాయల్స్​పైనా ఎలాంటి ఛార్జీలు విధించమని వివరించారు.