ఇన్ఫినిటీ వాక్ అంటే ఏంటి: మీ మెదడు, నాడీ వ్యవస్థకి సూపర్ రిలీఫ్ ఇస్తుంది..

 ఇన్ఫినిటీ వాక్ అంటే ఏంటి: మీ మెదడు,  నాడీ వ్యవస్థకి  సూపర్ రిలీఫ్ ఇస్తుంది..

నడక మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. సాధారణంగా 10 వేల అడుగులు నడవడం లేదా ఇంటర్వెల్ వాకింగ్ వంటివి శారీరక దృఢత్వాన్ని పెంచుతాయి. అయితే, చాల మందికి తెలియదు కానీ,  మెదడు & బ్యాలెన్స్ కోసం ఇన్ఫినిటీ వాక్ అనే ఒక ప్రత్యేక నడక పద్ధతి గురించి ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పద్ధతిలో 8 ఆకారం అంటే ఫిగర్-8 ప్యాటర్న్ లో నడుస్తారు.

 ఇన్ఫినిటీ వాక్ లేదా ఫిగర్-8 నడక అంటే ఏంటి: క్లినికల్ సైకాలజిస్ట్ డెబోరా సన్‌బెక్ 1980లలో ఈ ఇన్ఫినిటీ వాక్ పద్ధతిని డెవలప్ చేశారు. దీనిలో మనం నేలపై  Infinity గుర్తు గీసినట్లుగా, అంటే ఎనిమిది 8 నంబర్ ఆకారంలో నడుస్తాం. నడిచేటప్పుడు ఒక లక్ష్యంపై దృష్టి పెడతాం. ఈ నడక మెల్లగా మన Coordination మెరుగుపరుస్తుంది. 

 ఇన్ఫినిటీ వాకింగ్ ప్రభావాలు: ఇన్ఫినిటీ వాకింగ్ అనేది మెదడుకు ఒక మంచి వ్యాయామం లాంటిది. అధ్యయనాల ప్రకారం మీ దృష్టిని పదును పెట్టడానికి, బ్యాలెన్స్ పెంచడానికి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడానికి సహాయపడుతుంది. ఫిగర్-8 ఆకారంలో నడవాలంటే మెదడులోని ఎడమ, కుడి  రెండూ కలిసి పనిచేయాలి. 

PMCలో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం, మనం ఈ 8-ప్యాటర్న్‌లో నడిచేటప్పుడు, మెదడు ఒకేసారి చాలా పనులను బ్యాలెన్స్ చేస్తుందని నిరూపించబడింది. ఫిగర్-8 నడకలో నిరంతరం దిశ మారుతుంది. దింతో ప్రతి మలుపు, వంపు మన కండరాలను చురుకుగా మారుస్తుంది. దీనివల్ల శరీరం నిలువుగా ఉండటానికి చిన్న చిన్న సర్దుబాట్లు చేయడం నేర్చుకుని, మొత్తం భంగిమ మెరుగుపడుతుంది.

Also Read : మహాభారత యుద్దం చేసిన అశ్వత్థామ ఇంకా జీవించే ఉన్నాడా

ఇన్ఫినిటీ వాకింగ్ వల్ల అధ్యయనాలు తక్కువగా ఉన్నప్పటికీ,  మైండ్‌ఫుల్‌నెస్ కదలికలు ఒత్తిడిని తగ్గించి, స్పష్టతను పెంచుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్ఫినిటీ వాకింగ్ మన శరీరంలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను (Parasympathetic Nervous System) చురుకుగా మారుస్తుంది. ఈ వ్యవస్థ ఒత్తిడిని Stress Response బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది, తద్వారా మొత్తం ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి.

ఇన్ఫినిటీ వాకింగ్  పద్ధతి: 
*8 ఆకారంలో నడవడానికి వీలైనంత ఖాళీ స్థలం ఉండాలి 
*8 ఆకారంలో ఒక వంపు నుండి మొదలుపెట్టి ముందుకు నడవండి.
*ప్రతిరోజు 5–10 నిమిషాలు ఈ ఫిగర్-8 ఆకారంలో నడవండి.
*మీకు నడక అలవాటయ్యే కొద్దీ, మీ నడక స్పీడ్  పెంచడానికి ప్రయత్నించండి.

నాడీ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు కోలుకోవడానికి సహాయపడే వివిధ రకాల  కార్యక్రమాలలో కూడా ఇన్ఫినిటీ వాక్‌ను ఉపయోగిస్తున్నారు.  ఇన్ఫినిటీ వాక్ అనేది మెదడు, శరీరం రెండింటికీ ప్రయోజనం ఇచ్చే శక్తివంతమైన పద్ధతి.  8 ఆకారం నడవడం వల్ల మెదడు మరింత సమర్థవంతంగా పనిచేయడం, బ్యాలెన్స్ మెరుగుపడడం,  కండరాలు బలం పొందడం, ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు కొద్ది నిమిషాలు నడవడం  వల్ల  నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది.