
దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అంతేకాదు విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఎగుమతులపై పన్ను తగ్గింపు విషయమై పునరాలోచిస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అశించిన విధంగానే ఉంటుదని చెప్పారు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌తో పరిస్థితులు మెరుగుపడతాయని అనుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం పెరుగుతోందని తెలిపారు నిర్మలా సీతారామన్.