3 నెలల దిగువకు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌

3 నెలల దిగువకు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌
  • ఆహార పదార్ధాల ధరలు తగ్గడంతోనే 

న్యూఢిల్లీ : ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ జనవరిలో  మూడు నెలల కనిష్టానికి దిగొచ్చింది. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌  కిందటి నెలలో 5.10 శాతంగా రికార్డయ్యింది. కిందటేడాది  డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ 5.69 శాతంగా ఉంది.  వరుసగా 52 వ నెలలోనూ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పెట్టుకున్న  టార్గెట్‌‌‌‌‌‌‌‌ 4 శాతం పైనే రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ రికార్డయ్యింది. కానీ, అప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిట్‌‌‌‌‌‌‌‌ 6 శాతం దిగువన  వరుసగా ఐదో నెలలో నమోదయ్యింది. ముఖ్యంగా కూరగాయల ధరలు తగ్గడంతో జనవరిలో రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ దిగొచ్చింది. 

పెరిగిన ఐఐపీ

పరిశ్రమల ఉత్పాదకతను కొలిచే ఇండియా ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ (ఐఐపీ)   డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలలో 3.8 శాతం (ఇయర్ ఆన్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వృద్ధి చెందింది. 2022 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐఐపీ 5.1 శాతం గ్రోత్ నమోదు చేసింది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్పాదకత 3.9 శాతం వృద్ధి చెందగా, మైనింగ్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5.1 శాతం పెరిగింది.