దేశంలో కలకలం రేపుతోన్న ఇన్‌ఫ్లుయెంజా

దేశంలో కలకలం రేపుతోన్న ఇన్‌ఫ్లుయెంజా

కొవిడ్ లాంటి లక్షణాలతో దేశంలో కలకలం రేపుతోన్న ఇన్‌ఫ్లుయెంజా.. ప్రసుతం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కొన్ని మార్గదర్శకాలను సూచించింది. హెచ్3ఎన్2 వైరస్ కారణంగా చాలా మందిలో శ్వాసకోస ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

లక్షణాలు:

దగ్గు
వికారం
వాంతులు 
గొంతు మంట
శరీర నొప్పి
అతిసారం

ఈ ఇన్ఫెక్షన్ నుండి మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్నవారిని రక్షించుకోవడానికి చేయవలసినవి,  చేయకూడని పనులేంటో కూడా ఐసీఎంఆర్ వెల్లడించింది.

చేయాల్సినవి :

  • క్రమం తప్పకుండా నీరు, సబ్బుతో చేతులను కడుక్కోవాలి.
  • ఫేస్ మాస్క్‌లు ధరించాలి
  • రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగొద్దు
  • మీ ముక్కు, నోటిని పదే పదే తాకడం మానుకోవాలి.
  • దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు మీ ముక్కు, నోటిని ఏదైనా కర్చీప్ లాంటి వస్త్రంతో మూసుకోవాలి
  • హైడ్రేటెడ్ గా ఉండేందుకు పుష్కలంగా ద్రవాలు తీసువాలి.
  • జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నప్పుడు పారాసెటమాల్ తీసుకోవాలి.

చేయకూడనివి:

  • (కరచాలనం) షేక్ హ్యాండ్స్ చేయకూడదు
  • బహిరంగంగా ఉమ్మివేయకూడదు
  • స్వీయ వైద్యం మంచిది కాదు
  • యాంటీబయాటిక్స్, ఇతర మందులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి
  • తినేటప్పుడు ఇతరులకు దగ్గరగా కూర్చొని తినకూడదు

ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా కాదా అని నిర్ధారించే ముందు రోగులకు యాంటీబయాటిక్స్ సూచించవద్దని ఐఎంఏ వైద్యులను కోరింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పుల తరహా కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయని.. వీటికి యాంటీబయాటిక్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రజలు పరిశుభ్రతను పాటించాలని సిఫార్సు చేసింది. ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఒక వారం ఉంటుందని, కానీ లక్షణాలు మాత్రం ధీర్ఘకాలం ఉండే అవకాశముందని వెల్లడించింది.