
ఇన్ ప్లూయెంజా ఎ వైరస్ వేరియంట్ హెచ్3ఎన్2 (H3N2) కారణంగా భారతదేశంలో అనారోగ్యానికి గురవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. ఈ వైరస్ సోకిన వాళ్లలో జ్వరం, దగ్గు, అలసట లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గాలిలోని కొమొర్బిడిటీలు, అలెర్జీ కలిగించే కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. దేశంలో కేసులు విస్తరిస్తున్న వేల అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులను పరిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ (IDSP) తో 27 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసింది.
ఇన్ ప్లూయెంజా లక్షణాలు:
- దగ్గు
- జ్వరం
- చలి
- వికారం
- వాంతులు అవుతున్నాయి
- గొంతు నొప్పి / గొంతు నొప్పి
- అతిసారం
- కారుతున్న ముక్కు
- తుమ్ములు
ఈ వైరస్ సోకినప్పుడు కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి/అసౌకర్యం, ఆహారం మింగడంలో ఇబ్బంది, నిరంతర జ్వరం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఎవరికైనా ఈ లక్షణాలను అనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం.
వైరస్ ఎలా వ్యాపిస్తుంది:
H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ అంటువ్యాధి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఎక్కువగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వైద్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఫ్లూ- బారిన పడే అవకాశం ఎక్కవ.
రోగ నిరోధక శక్తి తగ్గడమే కారణం:
ఇన్ఫ్లుఎంజా లక్షణాలు ఎక్కువగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లకు సోకే ప్రమాధం ఉందని పీఎస్ఐఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పల్మనరీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీ్ప్ మెడిసిన్ చైర్మన్ గోపి చంద్ ఖిల్నాని అన్నారు.