ఫోన్లకు దూరంగా ఉంటేనే సక్సెస్ : ఎంపీ సుధామూర్తి

ఫోన్లకు దూరంగా ఉంటేనే సక్సెస్ :  ఎంపీ సుధామూర్తి
  • గురుకుల స్టూడెంట్స్ తో ఇన్ఫోసిస్ సుధామూర్తి

హైదరాబాద్, వెలుగు: టీచర్లు చెప్పే అంశాలను జాగ్రత్తగా వింటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్, ఎంపీ సుధామూర్తి తెలిపారు. ఫోన్లకు దూరంగా ఉంటేనే సక్సెస్​ సాధిస్తామన్నారు.క్రమశిక్షణ, ఓర్పు, సహనాన్ని అలవర్చుకోవడంతోపాటు ఇష్టమైన పుస్తకాలను చదువుతూ ఉండాలని విద్యార్థులకు సూచించారు. 

సోమవారం ఎస్సీ గురుకుల స్టూడెంట్లతో సుధామూర్తి జూమ్ మీటింగ్ లో మాట్లాడారు. ‘‘చెరుకు గడల నుంచి చక్కెరను తయారు చేసే ప్రక్రియలో  కర్మాగారం ఎంత ముఖ్యమైనదో విద్యార్థుల జీవితంలో కూడా పాఠశాల అనేది ఒక కర్మాగారం.  బాలికలు ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి.  నిర్లక్ష్యం, అతినిద్ర, ఆకర్షణలకు దూరంగా ఉండాలి’’ అని సుధామూర్తి అన్నారు.