ఇన్ఫోసిస్​కు1.5 బిలియన్​ డాలర్ల డీల్​ మిస్​

ఇన్ఫోసిస్​కు1.5 బిలియన్​ డాలర్ల డీల్​ మిస్​

న్యూఢిల్లీ :  ఐటీ మేజర్ ఇన్ఫోసిస్  పేరు వెల్లడించని  గ్లోబల్ కంపెనీతో 1.5 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  ఈ ఐటీ సేవల సంస్థ సెప్టెంబర్ 14, 2023న 15 సంవత్సరాల కాలానికి 1.5 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ప్రకటించింది.  గ్లోబల్ కంపెనీ ఇప్పుడు ఎంఓయూను రద్దు చేయాలని నిర్ణయించుకుందని ఇన్ఫోసిస్ శనివారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌‌లో తెలిపింది. ఇన్ఫోసిస్ ప్లాట్‌‌ఫారమ్‌‌లు,  ఏఐ సొల్యూషన్స్ ద్వారా ఈ గ్లోబల్​ కంపెనీ వ్యాపార కార్యకలాపాల, సేవలను ఆధునీకరించడం, డిజిటలైజ్​ చేయడం ఈ ఒప్పందం ఉద్దేశం.

ఇన్ఫోసిస్ ఈ కంపెనీ పేరును పేర్కొనలేదు. అది ఇప్పటికే ఉన్న క్లయింటా ? అనే విషయాన్ని కూడా చెప్పలేదు.  కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్  నీలాంజన్ రాయ్ దాదాపు ఆరేళ్లపాటు పదవిలో ఉన్న తర్వాత అకస్మాత్తుగా రాజీనామా చేసిన రెండు వారాలలోపే ఇది జరిగింది. ఇదివరకే భారతదేశ ఐటీ పరిశ్రమ నెమ్మదిస్తున్న సమయంలో ఇది జరిగింది. దీనివల్ల ఇన్ఫోసిస్​పై ఒత్తిడి పెరుగుతుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.  

గత 12 నెలల్లో కంపెనీ నుంచి కనీసం ఎనిమిది పెద్ద పోస్టులు ఖాళీ అయ్యాయి.  ఇన్ఫోసిస్ ఆటో విడిభాగాల పంపిణీదారు ఎల్‌‌కెక్యూ యూరప్ నుంచి ఐదేళ్ల ఒప్పందాన్ని గెలుచుకున్నట్లు గత వారం ప్రకటించింది.