
గ్రామీణ స్థాయి ప్లేయర్లకి అన్యాయం జరుగుతోందంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీలు ఆందోళనకు దిగారు. విజయ్ హజారే టోర్నీ సెలక్షన్స్ కోసం నిర్వహిస్తున్న ఛాలెంజర్స్ ట్రోఫీకి… జిల్లా ప్లేయర్లని ఎంపిక చేయలేదన్నారు. ECIL గ్రౌండ్స్ లో నిరసన తెలిపిన జిల్లా సెక్రటరీలు.. ప్రతిభ ఉన్న జిల్లా ప్లేయర్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని HCA అధికారులు , కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్లారు.