డైనింగ్ టేబుల్ మీద దూరంగా ఉన్న ఫుడ్ గిన్నెలను అందుకోవడానికి ప్రతిసారి పక్కన కూర్చున్న వాళ్ల సాయం తీసుకోవాలి. లేదంటే కుర్చీలో నుంచి లేవాలి. కానీ.. ఇలాంటి టర్న్ టేబుల్ ఉంటే ఎంత దూరంలో ఉన్న గిన్నెనైనా ఈజీగా కదలకుండానే తీసుకోవచ్చు. దీన్ని హోమ్ థ్రెడ్స్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని మీద ఎనిమిది ట్రేలు ఉంటాయి.
అవసరమైతే మరిన్ని యాడ్ చేసి ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. లేదంటే తగ్గించుకోవచ్చు. వీటిని గుండ్రంగా ఎటు కావాలంటే అటు వైపు తిప్పుకోవచ్చు. ఏ సైజు టేబుల్‌కైనా ఇది సరిపోతుంది. కొన్ని నిమిషాల్లోనే అసెంబుల్ చేసుకోవచ్చు. దీన్ని బిగించడానికి ప్రత్యేకంగా టూల్స్ కూడా అవసరం లేదు. గిన్నెలు ఎంత వేడిగా ఉన్నా ఈ ట్రేలు తట్టుకోగలవు. ట్రేల మీద నాన్-స్లిప్ సిలికాన్ ఉండడం వల్ల గిన్నెలు కిందపడే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాకుండా వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.
రీయూజబుల్ ఐస్ క్యూబ్స్
అప్పుడే చేసిన జ్యూస్, వైన్ లాంటివాటిని చల్లగా తాగాలి అనుకునేవాళ్లు వాటిలో ఐస్ క్యూబ్స్ వేస్తుంటారు. అవి కరిగి జ్యూస్‌ని పలచగా చేస్తాయి. రుచి కూడా మారుతుంది. అలాంటప్పుడు ఈ మెటల్ క్యూబ్స్‌ని వేసుకుంటే సరిపోతుంది. వీటిని అనూప్ టోర్డా అనే కంపెనీ తీసుకొచ్చింది. హై క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన ఈ క్యూబ్స్‌ని ముందుగా రెండు గంటలపాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. ఆ తర్వాత వాటిని ఏ డ్రింక్‌లో వేసినా దాన్ని కూల్‌గా చేసేస్తాయి. అంటే వెంటనే చల్లబరిచి, రెండు గంటల వరకు అలాగే ఉంచుతాయి. తుప్పు పట్టవు. అరిగిపోవు. మన్నికైనవి. వీటిని శుభ్రం చేయడం చాలా సులభం.
మిక్సింగ్ కప్
కాఫీ, టీ, హాట్ చాక్లెట్, ప్రొటీన్ షేక్‌లను బాగా కలపాలంటే చాలా టైం పడుతుంది. కానీ.. ఈ మగ్‌లో నీళ్లు, పౌడర్ వేసి స్విచ్ ఆన్ చేస్తే చాలు. కొన్ని నిమిషాల్లోనే సంపూర్ణంగా కలిసిపోతాయి. ఈ గాడ్జెట్‌ని జీవీ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇందులో ఇన్‌బిల్ట్ మోటరైజ్డ్ స్టీరింగ్ మెకానిజం ఉంటుంది. మోటార్ 7,000 ఆర్‌పీఎంతో తిరుగుతుంది. ఇది 400 ఎంఎల్ కెపాసిటీ కప్, ప్లాస్టిక్ వుడ్-స్టయిల్ హ్యాండిల్, స్పిల్ ప్రూఫ్ లిడ్‌తో వస్తుంది. ఇందులో రీచార్జబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. టైప్‌సీ కేబుల్‌తో చార్జింగ్ పెట్టుకుని వాడుకోవచ్చు. ఈ కప్‌ని దృఢమైన బోరోసిలికేట్ గాజుతో తయారుచేశారు. కాబట్టి హై టెంపరేచర్లను కూడా తట్టుకుంటుంది.
