స్మార్ట్‌ మార్కెటింగ్‌ యాప్‌ జెనీ ని ఆవిష్కరించిన ఇన్నోవిటి

V6 Velugu Posted on Jun 15, 2021

పేమెంట్స్ సొల్యూషన్స్ అందించడంలో లీడింగ్ లో ఉండే ఇన్నోవిటి సరికొత్త యాప్ ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణాల్లోని స్థానిక మొబైల్‌ డీలర్ల కోసం భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్‌ మార్కెటింగ్‌ యాప్‌’ జెనీ’ (GENIE ) ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌లో ఎదుర్కొంటున్న సమస్యలు.. ముఖ్యంగా కరోనా కారణంగా  ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మొబైల్‌ డీలర్‌ కమ్యూనిటీకి ఉపయోగపడేలా ఆన్‌లైన్‌ కస్టమర్లు కూడా రిటైల్‌ షాప్స్‌కు వచ్చేలా ‘జెనీ’ యాప్ ని రూపొందించారు.

ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణలో మొబైల్‌ రిటైలర్లు12% మంది ఇప్పటికే జెనీలో ముందస్తుగా నమోదు చేసుకున్నట్లు ఇన్నోవిటీ పేమెంట్‌ సొల్యూషన్స్‌ సీబీఓ అమృత మాలిక్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 2021 వరకు ఈ మార్కెట్‌లలో సమున్నత మార్కెట్‌ వాటా పొందుతుందని అంచనా. తెలుగు రాష్ట్రాలతో పాటు..రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా జెనీని విస్తరించనున్నట్లు  అమృత మాలిక్‌ చెప్పారు.

ఫిబ్రవరి 2021లో బెంగళూరు, మైసూరులలో జెనీని ఇన్నోవిటీ  ఆవిష్కరించింది. ఇన్నోవిటీకి యుఎస్‌కు చెందిన బెస్సీమర్‌ వెంచర్‌ పార్టనర్స్‌, ఎఫ్‌ఎంఓ, నెదర్లాండ్స్‌, కాటమరాన్‌, ఇండియా వంటి భారీ పెట్టుబడిదారులు మద్దతిస్తున్నారు.

జెనీ తో స్థానిక మొబైల్‌ డీలర్లకు మూడు ప్రయోజనాలు:

1.ప్రతి బ్రాండెడ్‌ మొబైల్‌ ఫోన్స్‌ అమ్మకంపై అదనంగా 0.5% నుంచి 1%మార్జిన్‌ అందిస్తుంది. ఇది లాభాలను వృద్ధి చేసుకోవడం కోసం సహాయపడుతుంది.
2.జెనీ EMI వాలెట్ ను వారికి అందిస్తుంది. దీంతో వారు ఎలాంటి ఉత్పత్తిపై అయినా జీరో కాస్ట్ EMI ని వినియోగదారులకు  అందించవచ్చు. ఇది మరింతగా అమ్మకాలు వృద్ధి చేసుకోవడంలో సహాయపడుతుంది.
3.110కు పైగా బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డులపై ఇన్‌స్టెంట్‌ జెనీ డిస్కౌట్‌ కూపన్లను ఇది అందిస్తుంది. దీంతో మరింత మంది వినియోగదారులను ఆకర్షించడంతో పాటుగా వాకిన్స్‌ కూడా పెంచుకోవచ్చు.

Tagged Innoviti launches GENIE, India first smart marketing app, local mobile retailers

Latest Videos

Subscribe Now

More News