థియేట‌ర్లలో టీ20 వ‌ర‌ల్డ్క‌ప్ లైవ్ మ్యాచ్‌లు

థియేట‌ర్లలో టీ20 వ‌ర‌ల్డ్క‌ప్  లైవ్ మ్యాచ్‌లు

టీవీ, మొబైల్ వరకే పరిమితమైన క్రికెట్ మ్యాచ్​లు థియేటర్లలో కనిపిస్తే ఎలా ఉంటుంది. అందులోనూ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ను థియేటర్లలో చూస్తే..  ఆ మాజానే వేరు కదా. ఆ మాజాను క్రికెట్ లవర్స్ కు  అందించేందుకు  ఐనాక్స్ రెడీ ఆయిపోయింది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఆడే అన్ని మ్యాచ్‌ల‌తో పాటుగా  సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచ్‌ల‌ను ఐనాక్స్ త‌న మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ప్రత్యక్ష ప్రసారం చేయ‌నుంది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐనాక్స్ లీజర్ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఐసీపీతో కుదుర్చుకున్న ఒప్పందం మేర‌కు 25 న‌గ‌రాల్లో ఐనాక్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ప్రసారం చేయ‌నుంది. ఐకాన్స్‌కు ప్రస్తుతం దేశంలోని 74 న‌గ‌రాల్లో 165 మల్టీప్లెక్స్‌లు ఉండగా, వీటిలో 705 స్క్రీన్స్ ఉన్నాయి. వీటిలో ఏకంగా 1.5 ల‌క్షల సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. ఐనాక్స్‌లో మ్యాచ్ చూడాలనుకుంటే రూ.200 నుంచి రూ.500 వరకు టిక్కెట్ ధర ఉంటుందని తెలుస్తోంది.  అక్టోబర్ 16  నుంచి ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. 23 న  భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.