- రజత్ బిడ్డ పెండ్లి ఖర్చులపై విచారణ జరపండి
- రాష్ట్ర ప్రభుత్వానికి డీవోపీటీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ కుమార్తె పెండ్లి ఖర్చుల ఆరోపణలపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని డీవోపీటీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీవోపీటీ) నుంచి తెలంగాణ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. రజత్ కుమార్ కూతురు పెళ్లికి ఒక కాంట్రాక్టు కంపెనీ బిల్లులు చెల్లించిందని ‘ది న్యూస్ మినిట్వెబ్సైట్’ బయటపెట్టింది. దీనిపై విచారణ జరిపించాలని మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచుల సంఘం మాజీ కార్యదర్శి, సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ డీపీవోటీకి కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్‌ను పరిగణనలోకి తీసుకున్న డీవోపీటీ దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ బుధవారం తెలంగాణ సీఎస్‌కు లేఖ రాసింది. రజత్ కుమార్ సీఈవోగా ఉన్న సమయంలోనూ అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని, ఆయన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గవినోళ్ల శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
