చిత్రపురి అవినీతిపై ముగిసిన విచారణ

చిత్రపురి అవినీతిపై ముగిసిన విచారణ
  • అవినీతిలో 16మంది బాధ్యులుగా నిర్ధారించిన కో ఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్

హైదరాబాద్ చిత్రపురి అవినీతి  ఆరోపణల పై విచారణ పూర్తి చేశారు కో ఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్టర్ చంద్రమ్మ. ఇష్యూలో 111 కోట్ల అవినీతి జరిగినట్టు తేల్చారు. 16 మందిని బాధ్యులుగా గుర్తించారు. ఎంక్వయిరీ పై టెంపరరీ స్టే కోసం ట్రిబ్యునల్ కి వెళ్లారు ప్రస్తుత కమిటీలో ఉన్న ఐదుగురు సభ్యులు. అగ్రిమెంట్ కి మించి కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ లో రూపంలో ఇచ్చినట్టు విచారణ తేలింది. 

కన్స్ ట్రక్షన్ అకౌంట్ కి అధిక మొత్తంలో సొసైటీ నుండి డబ్బులు బదిలీ చేసి మళ్లీ నగదు రూపంలో వెనక్కు తీసుకున్నారని యూవర్స్ కన్ స్ట్రక్షన్ అధినేత బీవీ నాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత కమిటీ లో ఉన్న ఐదుగురు జనరల్ బాడీ కూడా జరపొద్దని గతంలో స్టే ఇచ్చింది హైకోర్ట్. ఐతే మళ్ళీ స్టే కోసం ట్రిబ్యునల్ కి వెళ్లడం ఇష్యూను పక్క దారి పట్టించడమేనని చిత్రపురి సాధన సమితి ఆరోపిస్తోంది.