హైదరాబాద్ సిటీ, వెలుగు: చైతన్యపురిలో రాత్రికి రాత్రి బస్ షెల్టర్ తొలగించడంతోపాటు, సైన్ బోర్డులకు సంబంధించి మాన్యువల్‌గా ఫామ్ 1 లను పంపిణీ చేసిన అంశంపై ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి స్పందించారు. పూర్తిస్థాయిలో విచారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ ని ఆదేశించినట్లు తెలిసింది.
బస్ షెల్టర్ యథావిధిగా ఇదివరకు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఏర్పాటు చేయడంతో పాటు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు సహకరించిన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అడ్వర్టైజ్మెంట్సిబ్బంది సిబ్బంది, ఆఫీసర్ల పై నేడో,రేపో చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.
