17న కాకతీయ వర్సిటీకి విచారణ బృందం

17న కాకతీయ వర్సిటీకి విచారణ బృందం
  •  వీసీ, డీన్స్ నుంచి పీహెచ్ డీ అడ్మిషన్ల డేటా సేకరణ

హైదరాబాద్, వెలుగు :  కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్ డీ అడ్మిషన్లలో జరిగిన అక్రమాలపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ నేతృత్వంలో సర్కారు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవలే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ప్రొఫెసర్ వెంకటరమణ, పాండురంగారెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులతో కూడిన త్రిమెన్ కమిటీ సమావేశమైంది. అధికారుల నుంచి కొంత సమాచారం సేకరించింది. పీహెచ్ డీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రైమరీ డేటాను ఇప్పటికే కమిటీ సేకరించింది.

 ఈ నెల17న వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీకి వెళ్లి అక్కడి నుంచి మరింత సమాచారం సేకరించాలని నిర్ణయించింది. శనివారం కేయూ వీసీ రమేష్ తో పాటు డీన్స్ నుంచి వివరాలు రాబట్టనుంది. అనంతరం స్టూడెంట్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్ల నుంచి వినతిపత్రాలు సేకరించనుంది. వివరాల సేకరణ ఆధారంగా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయనే వివరాలతో  సర్కారుకు వారం, పది రోజుల్లో కమిటీ రిపోర్టు అందించనున్నది. కాగా, పీహెచ్ డీ అడ్మిషన్లలో అక్రమాలపై సర్కారు ఆదేశాలతో నిజనిర్ధారణ కోసం త్రిమెన్ కమిటీ వేసిన విషయం సంగతి తెలిసిందే.