మాల్దీవుల్లో చిక్కుకున్న ఇండియన్స్ తరలింపు

మాల్దీవుల్లో చిక్కుకున్న ఇండియన్స్ తరలింపు
  • మాలే పోర్టుకు చేరుకున్న ఐఎన్ఎస్ జలాశ్వ

మాలే : లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ తరిలించే ప్రక్రియ వేగవంతం చేశారు. మాల్దీవుల్లో ఉన్న ఇండియన్స్ తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు నేవీకి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ జలాశ్వ మాలే పోర్టుకు చేరుకుంది. దాదాపు వెయ్యి మంది ఈ నౌక ద్వారా భారత్ కు తీసుకురానున్నారు. సముద్ర సేతు ఆపరేషన్ లో భాగంగా తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. రక్షణ, విదేశాంగ, హోం, కేంద్ర ఆరోగ్య శాఖ కో ఆర్డినేషన్ తో ఈ ఆపరేషన్ కొనసాగించనున్నారు. తరలింపు ప్రక్రియలో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేసేలా అన్ని చర్యలు తీసుకున్నామని నేవీ అధికార ప్రతినిధి వివేక్ మధ్వాల్ తెలిపారు. మాలే నుంచి ఐఎన్ఎస్ జలాశ్వ కేరళకు తీసుకొస్తామని అక్కడ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తామన్నారు. ఇప్పటికే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో చిక్కుకుపోయిన మన దేశ పౌరులను తీసుకొచ్చేందుకు ఐఎన్‌ఎస్‌ శార్దూల్‌ అక్కడకు పంపించారు. యుద్ధనౌకలతో పాటు 64 విమానాల ద్వారా 12 దేశాల్లో చిక్కుకుపోయిన దాదాపు 15 వేల మంది భారతీయులను తిరిగి తీసుకురానున్నారు.