ఐఎన్ఎస్ తరపున స్వాతంత్ర్య వేడుకలు ప్రారంభం

ఐఎన్ఎస్ తరపున స్వాతంత్ర్య వేడుకలు ప్రారంభం

భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల పోర్టుల్లో భారతీయ యుద్ద నౌకలపైనా జాతీయ జెండా రెపరెపలాడింది. అందులో భాగంగా ఐఎన్ఎస్ సుమేధ నౌకలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆపరేషనల్ డిప్లాయ్‌మెంట్‌లో భాగంగా INS సుమేధ ఆగ్నేయ హిందూమహాసముద్రంలోని పెర్త్‌ హార్బర్‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే నేడు ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్సెస్ సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఐఎన్ఎస్ తరపు నుంచి ఆగస్టు 15న స్వతంత్ర వేడుకల్ని ప్రారంభించడం మరో చెప్పుకోదగిన విషయం. 

 ఫ్లీట్ ఆపరేషన్లు చేపట్టేందుకు పూర్తి దేశీయంగా తయారు చేసిన నౌక ఐఎన్ఎస్ సుమేధ. ఈ నౌక ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు వెళ్లటం ద్వారా ఆస్ట్రేలియా, భారత్ మధ్య స్నేహ సంబంధాలు పెంచుకునేందుకు దారులు సుగమమైనట్టు తెలుస్తోంది. అదే గనక జరిగితే భవిష్యత్‌లో పరస్పర  సహకారానికీ ఇది ప్రతీకగా నిలవనుంది. ఆస్ట్రేలియా నేవీ, ఇండియన్ నేవీ సంయుక్తంగా పని చేస్తూ..అంతర్జాతీయ జలాల్లో జరిగే వాణిజ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.