అంతరిక్షం నుంచి భూమిని చూస్తారా ఇన్ శాట్ 3డీఎస్ పంపిన ఫొటోస్

అంతరిక్షం నుంచి భూమిని చూస్తారా  ఇన్ శాట్ 3డీఎస్ పంపిన ఫొటోస్

ఇస్రో ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఇన్ శాట్ 3డీఎస్ శాటిలైట్ ప్రయోగించిన విషయం తెలిసిందే.. అయితే ఆ ఉపగ్రహం తీసిన భూగ్రహంతోపాటు ఇండియా చిత్రాలను ఇస్రో సోమవారం (మార్చి 11)న  విడుదల చేసింది. ఈ అత్యాధునిక ఉపగ్రహంలో లెటెస్ట్ ఇమేజర్, సౌండర్ పేలోడ్స్ వంటి పరికరాలున్నాయి. భూమి, భూ వాతావరణానికి సంబంధించిన అంశాలను ఈ పరికరాలు ఎంతో స్పష్టతతో ఫొటోలు తీయడంతోపాటు డేటాను విశ్లేషిస్తాయి. 

ఈ శాటిలైట్‌లోని 6 ఛానల్ ఇమేజర్ పరికరాలు భూమి, భూ ఉపరితలం, వాతావరణం చిత్రాలను  తీశాయని ఇస్రో తెలిపింది. మేఘాలు, ఏరోసోల్స్, భూమి ఉపరితల ఉష్ణోగ్రత, పర్యావరణ పరిస్థితి, నీటి ఆవిరి వంటి వాతావరణ, భూ ఉపరితలానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు బహుళ ఛానెల్‌ ఇమేజర్‌ ఎంతో ఉపకరిస్తుందని ఇస్రో పేర్కొంది. ఇన్‌శాట్‌-3డీఎస్‌ పంపిన తొలి ఫోటోలను ఎక్స్‌లో షేర్‌ చేసింది.