ట్రెయిన్ ఫుడ్ లో పురుగులు..ఐఆర్‌‌‌‌‌‌‌‌ సీటీసీకి 10 లక్షల ఫైన్

ట్రెయిన్ ఫుడ్ లో పురుగులు..ఐఆర్‌‌‌‌‌‌‌‌ సీటీసీకి 10 లక్షల ఫైన్
  •     సర్వీస్ ప్రొవైడర్‌‌‌‌‌‌‌‌కు 50 లక్షల జరిమానా, కాంట్రాక్టు రద్దు

న్యూఢిల్లీ: వందే భారత్​ ట్రెయిన్​లో అందించిన భోజనంలో పురుగులు వచ్చాయి. దీంతో ఫుడ్​ క్వాలిటీపై వచ్చిన ఫిర్యాదును అత్యంత తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ ఐఆర్‌‌‌‌‌‌‌‌సీటీసీకి అలాగే,  సర్వీస్ ​ప్రొవైడర్​కు భారీ జరిమానా విధిస్తూ కాంట్రాక్ట్​రద్దు చేసింది. మార్చి 15న పాట్నా – -టాటా నగర్ వందే భారత్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్​లో ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు కనిపించాయి. 

దీంతో ఆ ప్రయాణికుడు దానిని వీడియో తీసి రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన రైల్వే శాఖ.. ఐఆర్‌‌‌‌‌‌‌‌సీటీసీకి రూ.10 లక్షల ఫైన్ వేసింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌‌‌‌‌‌‌‌కు రూ. 50 లక్షల భారీ జరిమానా విధించడమే కాకుండా, వారి కాంట్రాక్టును రద్దు చేసింది. కాగా, రైల్వే ఏటా దాదాపు 58 కోట్ల మంది ప్రయాణికులకు భోజనాలు  అందిస్తోంది. ఫిర్యాదులు 0.0008% మాత్రమే ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.