- కిచెన్లలో బొద్దింకలు, పాడైన ఫుడ్ ఐటమ్స్ గుర్తింపు
గచ్చిబౌలి/సికింద్రాబాద్/వికారాబాద్, వెలుగు : గచ్చిబౌలి డీఎల్ఎఫ్ఏరియాలోని స్ట్రీట్‌ఫుడ్ రెస్టారెంట్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. సీనయ్య కిచెన్, కాయల్కేరళ రెస్టారెంట్, కనుమ రెస్టారెంట్, ఏఎమ్- పీఎం ఫుడ్‌కోర్టు, మండీ డీఎల్ఎఫ్, నూడిల్బార్ ను తనిఖీ చేశారు.
వీటిలోని కిచెన్లు అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ను డిస్ప్లే చేయకపోడంతోపాటు సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు తేల్చారు. కిచెన్లలో బొద్దింకలు తిరుగుతుండడం, పాడైన ఫుడ్ ఐటమ్స్ ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
బేగంపేట న్యూఊర్వశి రెస్టారెంట్లోనూ..
బేగంపేట పరిధిలోని న్యూఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. కిచెన్అపరిశుభ్రంగా ఉండడంతోపాటు ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నట్లు, పాడైపోయిన కూరగాయలను వాడుతున్నట్లు గుర్తించారు.
నాన్ వెజ్ఫుడ్ఐటమ్స్లో సింథటిక్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు తేల్చారు. ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసిన ఫుడ్ఐటమ్స్పై లేబులింగ్ లేదని తెలిపారు. మటన్, చికెన్, ఇతర పదార్థాలను టెస్టింగ్కోసం ల్యాబ్‌కు పంపించనున్నట్లు వారు వెల్లడించారు.
